తెలంగాణ

telangana

ETV Bharat / state

అరుదైన కాలేయ మార్పిడి... శస్త్ర చికిత్స సక్సెస్​ - మిస్‌ మ్యాచ్‌డ్ బ్లడ్‌ గ్రూప్‌ లివర్ ట్రాన్స్‌ప్లాంట్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి వైద్యులు ఓ యువతికి అరుదైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. బ్లడ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న దాత నుంచి కొంత కాలేయ భాగాన్ని సేకరించడాన్ని మిస్‌ మ్యాచ్‌డ్ బ్లడ్‌ గ్రూప్‌ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశామని ఆసుపత్రి వైద్యులు మనీష్ వర్మ వెల్లడించారు.

Rare liver transplant surgery is successful in apollo hospital jubilee hills hyderabad
అరుదైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స సక్సెస్​

By

Published : Sep 12, 2020, 11:13 PM IST

అరుదైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స సక్సెస్​

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి వైద్యులు ఓ యువతికి అరుదైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఆ హాస్పిటల్ సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌, హెచ్‌పీబీ విభాగాధిపతి డాక్టర్ మనీష్ వర్మ నేతృత్వంలోని లివర్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం బుడ్ చియారి సిండ్రోమ్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. 19 ఏళ్ల వయస్సున్న సౌమ్యకు ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ లివింగ్ డోనర్‌ లివర్ ట్రాన్స్‌ప్లాంట్​ను విజయవంతంగా నిర్వహించారు.

శస్త్ర చికిత్స అనంతరం రోగి సంపూర్ణంగా కోలుకోవడమే కాకుండా తన రోజువారి దినచర్యలు యథావిధిగా నిర్వహించుకుంటుందని వైద్యులు మనీష్ వర్మ స్పష్టం చేశారు. ఏదైనా ఏబీఓ లివింగ్ డోనర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో బ్లడ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న దాత నుంచి కొంత కాలేయ భాగాన్ని సేకరించడాన్ని మిస్‌ మ్యాచ్‌డ్ బ్లడ్‌ గ్రూప్‌ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటారని మనీష్ వర్మ వెల్లడించారు. రోగి సౌమ్య తల్లి వేరే బ్లడ్ గ్రూప్ అయినప్పటికీ తన కాలేయంలో ఓ ముక్కను ఆమెకు దానం చేసిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో గత నెల ఆగస్టు 11న సౌమ్యకు శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు మనీష్ వర్మ వివరించారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేసి ప్రాణాలు కాపాడినందుకు రోగి సౌమ్యతోపాటు అమె తల్లి స్వాతి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి :'రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details