హైదరాబాద్‌లోని బాలాపూర్ పరిధిలో గల వెంకటాపూర్‌కు చెందిన సిల్వేరి సాంబశివ విశ్వగురు కరోనా వారియర్ వరల్డ్ రికార్డుకు ఎంపికయ్యారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన అనేకమందికి ఉచితంగా నిత్యావసరాలు, మందులను ఆయన పంపిణీ చేసినందుకు ఆయన ఈ గుర్తింపు లభించింది.
కరోనా మేల్కొలిపెను మానవత్వం.. లభించెను అరదైన గౌరవం - minister sabitha indra reddy
కరోనా సంక్షోభ సమయంలో పేదల ఆకలి తీర్చిన ఓ వ్యక్తికి అరుదైన గుర్తింపు లభించింది. నగరంలోని బాలాపూర్‌కు చెందిన సాంబశివకు విశ్వగురు కరోనా వారియర్ వరల్డ్ రికార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
![కరోనా మేల్కొలిపెను మానవత్వం.. లభించెను అరదైన గౌరవం rare honor received a corona warrior](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10010713-1105-10010713-1608956798703.jpg)
కరోనా మేల్కొలిపెను మానవత్వం.. లభించెను అరదైన గౌరవం
కరోనా కారణంగా నగరంలోని బడంగ్‌పేట్, మీర్‌పేట్, జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధి కోల్పోయిన అనేక మందికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మారి సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను సాంబశివ ఉచితంగా పంపిణీ చేశారు. కొవిడ్ బాధిత కుటుంబాల వివరాలను తెలుసుకుని వారికి తగిన సహాయ సహకారాలు అందించారని ఆయనను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొనియాడారు. సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా కరోనా వారియర్ సంస్థ ప్రతినిధులు సాంబశివకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.