సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించి 74 ఏళ్ల మహిళ బృహద్ధమని కవాటానికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు హైదరాబాద్ విరించి ఆస్పత్రి ప్రకటించింది. రెండు నెలల క్రితం గుండె నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళకు చికిత్సను అందించామని వైద్యులు పేర్కొన్నారు.
ఆమె అరోటిక్ వాల్వ్ స్టెనోసిస్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మహిళ గుండె ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేయటమే అరోటిక్ వాల్వ్ పని. ఆ పని దాదాపుగా మూసుకుపోవటం వల్ల వాల్వ్ మార్చాలని వైద్యులు భావించారు. మహిళ వయసు ఎక్కువగా ఉండటం కారణంగా అప్పటికే ఆమె రక్తనాళాలు గట్టిపడ్డాయి. దీంతో ఇటీవల అందుబాటులోకి వచ్చిన హైడ్రా అరోటిక్ వాల్వ్ని మహిళకు అమర్చారు.