రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన మైనర్ బాలికల కేసులను పోలీసులు మూసివేశారని... వాటిని పునర్ విచారణ చేపట్టాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. హాజీపూర్ సంఘటనలాగే అదృశ్యమైన మైనర్ బాలికలపై ఇదే తరహాలో అకృత్యాలు జరిగి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 2 వేల కేసులను తిరిగి విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు. బాలికల అదృశ్యం కేసుల్లో సెల్ ఏర్పాటు చేసి... ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
'బాలికల అదృశ్యం కేసులను పునర్ విచారణ చేయాలి' - రాపోలు భాస్కర్
రాష్ట్రవ్యాప్తంగా బాలికల అదృశ్యం కేసులను పునర్ విచారణ చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. వీటికి సంబంధించి సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని కోరారు.

రాపోలు భాస్కర్
బాలికల అదృశ్యం కేసులను పునర్విచారణ చేయాలని ఫిర్యాదు
ఇదీ చదవండి : హైదరాబాద్లో మురికి నీటితో నిమ్మసోడా