Rapid Rail in Telangana in 2047 : తెలంగాణలో దూరప్రాంతాలకు వేగవంతమైన ప్రజా రవాణా సదుపాయాల కల్పనపై బీఆర్ఎస్ తమ ప్రణాళికలు వెల్లడించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా గంట వ్యవధిలో చేరుకునేలా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిల్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఐటీ రంగాన్ని.. చిన్న పట్టణాలకు విస్తరించేందుకు ఇది దోహదం చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం ఆయన 2047 హైదరాబాద్ విజన్ ప్రజెంటేషన్‌లో ఈ కారిడార్ల గురించి చెప్పారు. నగరంలో ఓఆర్ఆర్ వరకు మెట్రో.. అక్కడి నుంచి ర్యాపిడ్ రైల్ తీసుకొస్తామని పేర్కొన్నారు.
Transport Expansion in Telangana :తెలంగాణలో ప్రజా రవాణా సదుపాయాలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. 2047 విజన్‌తో ప్రజా రవాణాకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే ప్రజలకు ఆకర్షించే విధంగా మెట్రోలో మార్పులు తీసుకువచ్చారు. తెలంగాణలోని చాలా జిల్లాల ప్రజలు హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారు. ప్రజా రవాణా విస్తరణ వల్ల వారికి చాలా ఉపయోగం చేకూరుతుంది.
యువతకు కూరగాయలు అమ్మే ఉద్యోగాలు - కాంగ్రెస్ ఇచ్చే జాబ్స్ ఇవేనా : మంత్రి కేటీఆర్
Metro Expansion In Telangana :ప్రజా రవాణాకు సంబంధించి మొదలు హైదరాబాద్ నుంచి విజయవాడ (దాదాపు 250 కిలో మీటర్లు) గంటన్నరలో చేరుకునేలా ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రభుత్వం చేపట్టనుంది. దీనివల్ల రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు గొప్ప మలుపు అవుతుందని పేర్కొంది. రోజుకు విజయవాడ - హైదరాబాద్ మధ్య వందలాది మంది ప్రయాణిస్తుంటారు. కాగా మొదటి అయిదేళ్లలో 250 కిలో మీటర్లు.. రాబోయే పదేళ్లలో 415 కిలో మీటర్ల మెట్రో విస్తరణ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇల్లు కొనుగోలు చేసే మధ్య తరగతి ప్రజలకు త్వరలోనే గొప్ప శుభవార్త : మంత్రి కేటీఆర్
1. శామీర్‌పేట (ఓఆర్ఆర్) - గజ్వేల్ - కొమరవెల్లి - సిద్దిపేట - కరీంనగర్ - 140 కిలో మీటర్లు.
2. ఘట్కేసర్ (ఓఆర్ఆర్) - బీబీనగర్ నుంచి యాదాద్రి, జనగాం, రఘనాథపల్లి, స్టేషన్ ఘన్పూర్ - వరంగల్ 113 కిలో మీటర్లు.
3. పెద్ద అంబర్‌పేట(ఓఆర్ఆర్)