తెలంగాణ

telangana

ETV Bharat / state

కోఠి ఇసామియా బజార్‌లో 30 నిమిషాల్లో కరోనా పరీక్ష - rapid antigen covid-19 tests in hyderabad

కరోనా కేసులు త్వరితగతిన గుర్తించేందుకు కోఠి ఇసామియా బజార్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షలు చేసున్నారు. శాంపిల్స్ తీసుకున్న 30 నిమిషాల్లో ఫలితాలు వస్తున్నాయని వైద్య అధికారిణి చందన తెలిపారు.

rapid antigen covid-19 tests in primary healthcare center at koti esamia bazar hyderabad
కోఠి ఇసామియా బజార్‌లో 30 నిమిషాల్లో కరోనా పరీక్ష

By

Published : Jul 11, 2020, 8:04 PM IST

కరోనా లక్షణాలు ఉన్నవారికి, కరోనా పేషేంట్స్‌తో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి కోఠి ఇసామియా బజార్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ర్యాపిడ్‌ యాంటిజెన్ నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు త్వరితగతిన గుర్తించేందుకు ఈ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వైద్య అధికారిణి చందన తెలిపారు. శాంపిల్స్ తీసుకున్న 30 నిమిషాల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.

ఈ రోజు 44 శాంపిల్స్‌ను పరీక్షించామని, అందులో 5 కేసులు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా వచ్చి లక్షణాలు అధికంగా ఉన్నవారిని గాంధీ ఆస్పత్రికి పంపుతున్నామని... లక్షణాలు లేనివారికి ముందులు ఇచ్చి హోం ఐసోలేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అజాగ్రత్త వల్లే.. ఆ కుటుంబంలో 25 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details