హైదరాబాద్ శంషాబాద్ పరిధిలోని ఓ గ్రామంలో 75 సంవత్సరాల వయసున్న ఓ వృద్ధ మహిళను బెదిరించి అమానవీయంగా 60 ఏళ్లున్న ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత నెల 15న ఈ దారుణం జరిగింది. మనస్తాపం చెందిన వృద్ధురాలు గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లింది. న్యాయం చేయాల్సిన గ్రామపెద్దలు నిందితుడికే వత్తాసు పలుకుతూ ఎంతో కొంత పరిహారం చెల్లిస్తాడని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఆమె బంధువుల వద్ద తన గోడు వెల్లబోసుకోగా విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
75 ఏళ్ల వృద్ధురాలిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం - Rape Old Women
హైదరాబాద్ శంషాబాద్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వృద్ధురాలిపై అత్యాచారం