తెలంగాణ

telangana

ETV Bharat / state

Rape on Minor Girl in Hyderabad : సెల్‌ఫోన్ ఆశ చూపి.. మైనర్‌ బాలికపై తండ్రీకుమారుల అత్యాచారం - మైనర్ బాలికపై తండ్రికొడుకుల అత్యాచారం

Rape on Minor Girl in Hyderabad : మహిళలు, చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ మైనర్ బాలికపై.. తండ్రీకుమారులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.

minor girl raped in Petbasheerabad
father and son raped a minor girl at kompally

By

Published : Aug 11, 2023, 7:51 PM IST

Rape on Minor Girl in Hyderabad: సమాజంలో రోజురోజుకూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేదు.. ఆడపిల్ల అయితే చాలనుకుని మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరికొందరు. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా జంకుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

Father and Son Raped a Minor Girl at Kompally : సెల్‌ఫోన్ ఇస్తామని ఆశచూపించి ఓ మైనర్ బాలికపై(Rape on Minor Girl).. తండ్రీకుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బతుకు దెరువు కోసం ఓ కుటుంబం 7 సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చిందని పోలీసులు తెలిపారు. వీరు ఇక్కడ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. రోజువారీలాగే ఆ తల్లిదండ్రులు.. తమ పాపను ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లారని పేర్కొన్నారు.

బ్రేకప్ చెప్పిందని కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి.. బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్

ఈ క్రమంలోనే వీరి ఇంటికి సమీపంలో శివకుమార్‌ కుటుంబం నివసిస్తోందని పోలీసులు తెలిపారు. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఆ మైనర్ బాలికను శివకుమార్‌(45), అతని కుమారుడు శ్యామెల్‌ (19) గమనించారని చెప్పారు. ఇందులో భాగంగానే ఆ చిన్నారికి సెల్‌ఫోన్‌ ఇస్తామని ఆశ చూపించి.. అత్యాచారానికి పాల్పడ్డారని వివరించారు. సాయంత్రం పని నుంచి వచ్చిన తల్లిదండ్రులతో.. బాధిత బాలిక కడుపునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు.

ఉద్యోగం పేరుతో 'ఆమె'ను వ్యభిచార ఊబిలోకి నెట్టిన అంకుల్​..

వెంటనే వారు ఆ పాపను ఆసుపత్రిగా తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బాధిత బాలికకు మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన తండ్రీకుమారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తమ కుమార్తెపై ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మైనర్​పై రెండేళ్లుగా రేప్.. దోషికి 142ఏళ్ల శిక్ష.. పోక్సో కోర్టు సంచలన తీర్పు

వికారాబాద్ జిల్లాలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని ఇంటి వద్ద దింపుతానని చెప్పి కారులో తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

అత్యాచారం చేసి చంపేశారు..! పాలమూరులో వెలుగుచూసిన అకృత్యం..

రన్నింగ్ ట్రైన్​లో రేప్​.. బిడ్డను బయట పడేస్తామని బెదిరించి తల్లిపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details