సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీలో వక్రబుద్ధి చూపించాడో ప్రబుద్ధుడు. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఎవరూ చూడకుండా లోపలికి ప్రవేశించాడు. గుట్టుచప్పుడు కాకుండా గడియ పెట్టేశాడు. ఆమెపై అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు.
మహిళను బలాత్కరించబోతే కొరికేసింది! - Rape Attempt on Women Locals Attack on Men in Secundrabad
మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ విషయాన్ని ఎదురింటాయన గమనించాడు. ఎవరూ చూడకుంటా ఇంట్లోకెళ్లి వక్రబుద్ధి చూపించాడు. మహిళ కేకలు వేసింది. ఆగ్రహించిన బస్తీవాసులు అతడిని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ఈస్ట్ మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మహిళ ప్రతిఘటించింది. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో చేయిని బలంగా కొరికింది. గట్టిగా కేకలు వేసింది. బస్తీవాసులు ఇంటిని చుట్టుముట్టారు. తలుపులు పగలగొట్టారు. అతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. తుకారాం గేట్ పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఇటువంటి పనులకు పాల్పడ్డాడని, పోలీసులకు సమాచారం అందిస్తే పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:భారత్‌కే కరోనా వస్తే... పరిస్థితి ఏంటి?