మైనర్ బాలికపై అత్యాచారం చేయబోయిన ఇద్దరు ప్రబుద్ధులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లిలో చోటుచేసుకుంది. బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు ఓ మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారు.
చెత్త ఏరుకునే బాలికపై అత్యాచారయత్నం... యువకుల దేహశుద్ధి
చెత్త ఏరుకునే ఓ మైనర్ బాలికకు డబ్బు ఆశ చూపించి... అత్యాచారం చేయబోయిన కామంధులకు స్థానిక యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.
అత్యాచారం చేయబోయిన కామంధులకు దేహశుద్ధి
స్థానిక యువకులు గమనించి ఇద్దరు కామంధులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. బాలికను, ఇద్దరు నిందితులను ఠాణాకు తరలించారు. బాలిక కుటుంబ సభ్యులు స్థానికంగా చెత్త ఏరుకుంటూ నివాసముంటున్నట్లు సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి ఈటల