ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని తాపేశ్వరం గ్రామంలో బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తెలిపారు. యువకుడు బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించగా బాలిక కేకలు వేసింది. బాధితురాలి అరుపులు విన్న ఆమె చెల్లి వచ్చి గట్టిగా అరవటం వల్ల నిందితుడు పరారయ్యాడు.
బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు - తాపేశ్వరంలో బాలికపై అత్యాచారం తాజా వార్తలు
ఏపీలోని తాపేశ్వరంలో బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. బాలిక అరవడం వల్ల కుటుంబ సభ్యులు రావటాన్ని గమనించిన నిందితుడు పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై అత్యాచారయత్నం... కేసు నమోదు
గత కొంతకాలంగా బాలికను వేధిస్తున్నాడని, విషయం ఆమె తల్లికి తెలియజేయటం వల్ల యువకుడిని మందలించారు. ఈ తరుణంలో బాలికపై సదరు యువకుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.