సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో, సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లకుంటలోని పాత రామాలయం వద్ద ముగ్గుల పోటీలు జరిగాయి. ముషీరాబాద్విద్యానగర్లోని ఓ అపార్ట్మెంట్లో నిర్వహించిన రంగోళి పోటీలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆయన సతీమణి ఉమా లక్ష్మణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సంక్రాంతి పండుగ అంటేనే ముత్యాల ముగ్గులు గుర్తొస్తాయని ఈ రంగవల్లులను తీర్చిదిద్దడంలో మహిళలు ఎంతో సంతోషిస్తారని ఉమాలక్ష్మణ్ తెలిపారు. ముగ్గుల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.