తెలంగాణ

telangana

ETV Bharat / state

రేంజ్​రోవర్​ కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం - అగ్నికి ఆహుతైన రేంజ్​ రోవర్​ కారు

Range Rover Car Burnt: హైదరాబాద్ లక్డీకపూల్‌లో రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు దట్టమైన పొగలు రావడంతో గమనించి.. వెంటనే అందులో నుంచి దిగి పక్కకు నిలిపివేశారు. కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది.

రేంజ్​రోవర్​ కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం
రేంజ్​రోవర్​ కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం

By

Published : Apr 13, 2022, 7:20 PM IST

Range Rover Car Burnt: హైదరాబాద్ లక్డీకపూల్‌లో ఓ రేంజ్​రోవర్‌ కారు అగ్నికి ఆహుతి అయ్యింది. లక్డీకపూల్‌ వెంకటేశ్వర హోటల్‌ ముందుకు రాగానే రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడం గమనించి కారును పక్కకు ఆపేసి.. అందులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనం మంటలను ఆర్పేసింది.

వరంగల్​కు చెందిన వ్యాపారవేత్త సామల వంశీకృష్ణ.. మాసబ్ ట్యాంక్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వాహనాలు అధికంగా వెళ్లే మార్గం కావడంతో.. ఈ ఘటన వల్ల కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

రేంజ్​రోవర్​ కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details