Naveen Murder case Updates: హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్య సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణ లొంగిపోయినా.. పోలీసులు బలమైన ఆధారాల వేటలో ఉన్నారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు.. రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు దాఖలు చేసిన హరిహరకృష్ణ కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.
Abdullapur met incident నవీన్ హత్య కేసులో పోలీసులు.. నిందితుడిని 8 రోజుల కస్టడీ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కోర్టును కోరారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన కోర్టు... హరిహరకృష్ణ కస్టడీపై రేపు తీర్పు ఇవ్వనున్న తెలిపింది. ఈ నవీన్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు ధర్మాసనానికి వెల్లడించారు. నిందితుడిని నుంచి పలు వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. హరిహరకృష్ణ తన ఫోన్ డేటాను డిలీట్ చేశాడని కోర్టుకు పోలీసులు తెలిపారు. నవీన్ మొబైల్ ధ్వంసం చేసి చెట్ల పొదల్లో పడేశాడని వివరించారు. హత్య తర్వాత నిందితుడు ఎక్కడికి వెళ్లాడో తెలుసు కోవాలని పేర్కొన్నారు. నిందితుడు ఆధారాలు మాయం చేసి తప్పించుకోవాలని చూశాడని వాదించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు.. తీర్పును రేపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
Naveen Murder case In Hyderabad: నవీన్ హత్యకు సంబంధించి నేరం జరిగిన ప్రాంతాన్ని సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ హత్య వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నవీన్ చరవాణిని ధ్వంసం చేసిన హరిహర.. దాన్ని ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న పొదల్లో పడేశాడని అనుమానిస్తున్నారు.