ముఖ్యమంత్రి కేసీఆర్ను కించపరిచారనే కేసులో నిన్న రాత్రి అరెస్టైన భాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని కించపరిచేలా డ్రామా వేయించారనే తెరాస నేతల ఫిర్యాదుతో హయత్నగర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిదంటే: జూన్ 2న అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభను జిట్టా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ను కించపరుస్తూ డ్రామా వేయించారని జిట్టా బాలకృష్ణారెడ్డిపై తెరాస నేతలు చేసిన ఫిర్యాదుపై నిన్న అర్ధారాత్రి ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసుల తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.