ఏపీలోని గుంటూరు సీఐడీ కార్యాలయంలో రంగనాయకమ్మ విచారణ ముగిసింది. అధికారులు తనతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారని రంగనాయకమ్మ అన్నారు. అతన్ని విచారించే సమయంలో కూడా రావాలని చెప్పారని తెలిపారు. గతంలో తన ఫేస్‌బుక్ పోస్టులపై కూడా అడిగినట్లు రంగనాయకమ్మ వెల్లడించారు. అన్నింటిని ప్రజల కోసమే తన అభిప్రాయంగా చెప్పానని.. పత్రికలు, టీవీల్లో దృశ్యాలు చూసి స్పందించినట్లు తెలిపారు. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని రంగనాయకమ్మ స్పష్టం చేశారు.
రంగనాయకమ్మతో ముగిసిన సీఐడీ విచారణ - సీఐడీతో ముగిసిన రంగనాయకమ్మ విచారణ న్యూస్
ఆంధ్రప్రదేశ్లో గుంటూరు సీఐడీ కార్యాలయంలో రంగనాయకమ్మ విచారణ ముగిసింది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు ఆమెకు సూచించారు. ప్రజల కోసమే తన అభిప్రాయం చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
సీఐడీతో ముగిసిన రంగనాయకమ్మ విచారణ