తెలంగాణ

telangana

ETV Bharat / state

హోంమంత్రి నివాసంలో రంజాన్​ వేడుకలు - Ktr

సోదరత్వం, మతసామరస్యానికి సూచికైన రంజాన్​ పర్వదినాన్ని రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్​లో హోంమంత్రి మహమూద్ అలీ నివాసంలో జరిగిన రంజాన్​ వేడుకలకు కేటీఆర్, తెరాస ముఖ్యనేతలు పాల్గొన్నారు.

హోంమంత్రి నివాసంలో రంజాన్​ వేడుకలు

By

Published : Jun 5, 2019, 5:28 PM IST

హైదరాబాద్​లో హోంమంత్రి మహమూద్ అలీ నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షు, మంత్రులు తలసాని, మల్లారెడ్డి, ఎంపీ కేశవరావు, మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. వారితో పాటు సీఎస్‌ జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ పండుగ సోదరత్వం, మతసామరస్యతకు సూచిక అని కేటీఆర్ కొనియాడారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని నేర్పుతుందని వివరించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

హోంమంత్రి నివాసంలో రంజాన్​ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details