తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాపార లావాదేవీలే ప్రాణం తీశాయి..? - టాస్క్ ఫోర్స్ పోలీసులు

వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొగంటి సత్యంతో పాటు...నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారి తీసిన కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. గత రెండు నెలలుగా హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వ్యాపార లావాదేవీలే ప్రాణం తీశాయి..?

By

Published : Jul 9, 2019, 7:51 AM IST

Updated : Jul 9, 2019, 10:32 AM IST

వ్యాపార లావాదేవీలే ప్రాణం తీశాయి..?

హైదరాబాద్​ పంజాగుట్ట పీఎస్​ పరిధిలో జరిగిన రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కోగంటి సత్యంను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని సత్యం చెబుతున్నాడు. అయితే వ్యాపారంలో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ పోలీస్ అధికారి సాయంతో రాంప్రసాద్ తనను వేధించినందుకే హత్యకు కుట్ర పన్నినట్లు సమాచారం. కిరాయి ముఠాలకు సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

ఆర్థికంగా ఇబ్బందులు, వేదింపులు@హత్య
హత్య చేసిన శ్యామ్, రమేశ్, చోటు అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం, వేధింపులకు పాల్పడటం వల్లే రాంప్రసాద్ ను హత్య చేశామని శ్యామ్ అనే నిందితుడు కొన్ని మీడియా సంస్థల వద్ద వెల్లడించారు. ఇందులో సత్యం హస్తం లేదని తెలపడాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. రాంప్రసాద్ హత్యకు రెండు నెలలుగా రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పక్కా ప్రణాళికతో...
గచ్చిబౌలిలో నూతన ఇల్లు నిర్మించుకున్న రాంప్రసాద్ కొన్ని రోజుల క్రితం గృహప్రవేశం చేశాడు. అక్కడికి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు కిరాయి ముఠా కూడా వెళ్లి పరిశీలించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వస్తాడని తెలుసుకున్న కిరాయి ముఠా మాటు వేసి ఈ నెల 6న రాత్రి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

కీలక సమాచారం సేకరించిన పోలీసులు
కోగంటి సత్యం, రాంప్రసాద్ ల మధ్య నెలకొన్న విభేదాలు, హత్యకు దారితీసిన కారణాలు, ఆధారాలను పంజాగుట్ట పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన పోలీసులు... సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు.

ఇదీ చూడండి :ఆసనాలలో రాటుదేలింది... అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది

Last Updated : Jul 9, 2019, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details