భారీ వర్షాలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులను ఆదుకునేందుకు రామోజీగ్రూపు ముందుకొచ్చింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో బాధితుల సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను సంస్థ ప్రతినిధి మంత్రి కేటీఆర్‌కి అందించారు.
వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం - ramoji film city news
హైదరాబాద్ వరదలు, వానలతో అల్లాడుతోంది. సీఎం కేసీఆర్ పిలుపుతో భాగ్యనగరాన్ని ఆదుకునేందుకు రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. తాజాగా రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. రామోజీ సంస్థల దాతృత్వాన్ని ప్రశంసిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం
రామోజీ గ్రూప్ దాతృత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కేటీఆర్. వరద సహాయ కార్యక్రమాలకు రూ.5 కోట్లు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు మంత్రి తారకరామారావు.
- ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం
Last Updated : Oct 22, 2020, 6:03 PM IST