Ramoji foundation help for fire station: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో నూతన అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ చేయూతనందించింది. పురాతన భవనంతో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా స్పందించిన రామోజీ ఫౌండేషన్... రూ.కోటితో సకల హంగులతో నూతన భవనానికి శ్రీకారం చుట్టింది. నూతన ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరీ.... అగ్నిమాపకశాఖ డీజీ సంజయ్‌కుమార్‌జైన్‌తో కలిసి భూమి పూజ చేశారు. భవన నిర్మాణంతో పాటు సిబ్బందికి వసతులు, ఇతర సౌకర్యాలను నిర్మించనున్నారు.
Ramoji foundation: హయత్‌నగర్ ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ చేయూత - తెలంగాణ వార్తలు
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో నూతన అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్(Ramoji foundation) చేయూతనిచ్చింది. పురాతన భవనంతో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా స్పందించిన రామోజీ ఫౌండేషన్... రూ.కోటితో సకల హంగులతో నూతన భవనానికి శ్రీకారం చుట్టింది.
అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ చేయూత
మోడల్ ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి ముందుకొచ్చిన రామోజీ ఫౌండేషన్‌కు అగ్నిమాపకశాఖ అధికారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:Ramoji film city : రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం
Last Updated : Nov 24, 2021, 1:44 PM IST