ప్రపంచంలోనే అతి పెద్ద చిత్ర నగరిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన రామోజీ ఫిల్మ్ సిటీ.. సందర్శకుల కోసం ఫిబ్రవరి 18న తిరిగి తెరుచుకుంది. సుమారు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అద్భుత పర్యటక ప్రదేశం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. నిరంతరం చిత్రీకరణలు జరుపుకొనే రామోజీ ఫిల్మ్ సిటీలో.. షూటింగ్ స్పాట్లు, నందనవనాలు, లైవ్ షోలు, ప్లే కోర్టులు, థ్రిల్‌కు గురిచేసే సాహస్ అడ్వెంచర్ ల్యాండ్, బాహుబలి సెట్లు మిమ్మల్ని మైమరిచిపోయేలా చేస్తాయి.
ఒక్కసారి కుటుంబసమేతంగా వీక్షించి.. మీ హాలిడేను చిరస్మరణీయంగా మలచుకోండి.
1. స్టూడియో టూర్
స్టూడియో టూర్‌తో అద్భుత ఊహా లోకంలో ఆనందంగా గడపండి. వింటేజ్ బస్సుల్లో ప్రయాణిస్తూ రోజంతా అద్భుత ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదించండి. సినిమా సెట్టింగ్‌లు, సుందరమైన ఉద్యానవనాలు, మనసును ఆహ్లాదపరిచే లొకేషన్లు సందర్శిస్తూ.. విభిన్న వినోదంతో మీ హాలిడేను చిరస్మరణీయం చేసుకోండి.
2. యురేకా
రెప్పపాటులో వేరే యుగానికి, టైమ్ జోన్లోకి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఫిలింసిటీలో యురేకాను ఒక్కసారైనా మీరు సందర్శించాల్సిందే. రాజుల కాలాన్ని తలపించే కోటలు, మొగలుల వైభవం, మౌర్యులు శౌర్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. అమెరికన్ వైల్డ్ వెస్ట్ అందాలతో వినూత్న అనుభవాన్ని పొందుతారు. ఆటపాటలు, ప్లే కోర్టులు, థీమ్డ్ రెస్టారెంట్లు, మధ్యయుగాన్ని తలపించే మీనా బజార్ విశేషంగా ఆకర్షిస్తాయి.
3. లైవ్ షోలు
రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే లైవ్ షో రంగుల వినోదాన్ని అస్సలు మిస్ కావద్దు. అదిరే కొరియాగ్రఫీతో చేసే లైవ్ డాన్స్ షోలు, యాక్షన్ ప్యాక్డ్ వైల్డ్ వెస్ట్ స్టంట్ షో చూస్తే వారెవా అంటారు. కళాకారుల ఆన్ స్టేజ్ లైవ్ పెర్ఫామెన్స్‌కు యానిమేషన్ కలిపి చేసే బ్లాక్లైట్ షో మరో హైలైట్.
4. రామోజీ మూవీ మ్యాజిక్
ఫిలిం మేకింగ్‌లో చిట్కాలు తెలుసుకోవాలా? అయితే రామోజీ మూవీ మ్యాజిక్కు వచ్చేయండి. ఈ అద్వితీయ ఇంటరాక్టివ్ షోలో మీరు అంతరిక్ష నౌక ఎక్కొచ్చు. గెలాక్సీలో ప్రయాణించిన అనుభూతి పొందొచ్చు. ఫిల్మీ దునియాలో డార్క్ రైడ్‌తో ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదించొచ్చు. పౌరాణిక అల్లాదీన్ ప్యాలెస్, ప్రపంచ వింతలతో ఊహల్లో విహరించొచ్చు.
5. చిల్డ్రన్స్ అట్రాక్షన్