తెలంగాణ

telangana

ETV Bharat / state

బోరబండలో ఘనంగా రంజాన్​ సహేరీ - ghmc deputy mayor

మత సామరస్యం పెంపొందేలా బోరబండలో హిందూ, ముస్లింలు కలిసి రంజాన్​ సందర్భంగా సహేరీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్వేషాలకు ఆస్కారం లేకుండా ప్రతి ఏటా దీనిని నిర్వహిస్తున్నట్లు జీహెచ్​ఎంసీ డిప్యూటీ మేయర్​ బాబా ఫసీయుద్దీన్​ అన్నారు.

రంజాన్​ దీక్షలు

By

Published : May 16, 2019, 7:43 AM IST

ముస్లింల పవిత్ర ఉపవాస దీక్షలను పురస్కరించుకుని బోరబండలో సహేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ డిప్యూటీ మేయర్​ బాబాఫసీయుద్దీన్​ పాల్గొన్నారు. ఇక్కడ కేవలం రంజాన్​ మాసంలోనే కాకుండా ఇతర పండుగల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందని స్థానికులు తెలిపారు.

సమైక్యత పెంపొందించేందుకు కృషి

సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి జీవించడం వల్ల వారి మధ్య సమైక్యత, సమగ్రత పెంపొందుతాయని డిప్యూటీ మేయర్​ఫసీయుద్దీన్ అన్నారు. మత విద్వేషాలకు అవకాశం లేకుండా గత నాలుగేళ్లుగా దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఘనంగా రంజాన్​ సహేరీ

ఇదీ చూడండి : నిప్పుల కొలిమి @45 డిగ్రీలు



ABOUT THE AUTHOR

...view details