తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చా: నిమ్మగడ్డ - AP SEC NEWS

ఏపీ హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పందించారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని తెలిపారు.

ramesh-kumar-nimmagadda-reaction-on-high-court-verdict
హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చా:నిమ్మగడ్డ

By

Published : May 29, 2020, 12:27 PM IST

ఏపీ హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చానని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వెల్లడించారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని వివరించారు. పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

'వ్యక్తులు ముఖ్యంకాదు... వ్యవస్థ ముఖ్యం. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఈ సంస్థల సమగ్రతను కాపాడాలి. వ్యక్తులు శాశ్వతంగా ఉండరు... రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయి.'- నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఇదీ చదవండి:ఎస్​ఈసీ వ్యవహారం.. ఎవరేమన్నారంటే..?

ABOUT THE AUTHOR

...view details