ఉచితంగా నీటి సరఫరా ఇస్తామని చెప్పి మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులను మోసం చేశారని బోర్డు సభ్యుడు రామకృష్ణ పేర్కొన్నారు.
'కంటోన్మెంట్ వాసులను మోసం చేశారు' - cantonment secbad updates
జీహెచ్ఎంసీ మాదిరిగా ఉచిత నీటి సరఫరా అందించాలని కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో.. కంటోన్మెంట్ ప్రాంతానికి ఉచిత నీటి సరఫరా అంశం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
!['కంటోన్మెంట్ వాసులను మోసం చేశారు' Ramakrishna, a member of the cantonment board, demanded that a free water supply be provided like GHMC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10201660-17-10201660-1610364202955.jpg)
'కంటోన్మెంట్ వాసులను మోసం చేశారు'
ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు నీటి బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే ఇక్కడ కూడా నీటి సరఫరాను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా ఆర్.నారాయణమూర్తి సినిమా