పర్యావరణానికి మేలు చేసే హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ మహోన్నత ఘట్టమని వ్యాఖ్యానించారు. ఈ ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంతోష్ ఛాలెంజ్ స్ఫూర్తిదాయకం: రామజోగయ్య శాస్త్రి - ramajogaiah shastri appreciates mp santosh kumar green India challenge
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమాన్ని సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కొనియాడారు. మణికొండలోని తన నివాసంలో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన రామజోగయ్య.... మరో ముగ్గురికి ఛాలెంజ్
మణికొండలోని తన నివాసంలో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా రామజోగయ్య మొక్కలు నాటారు. ఈ సంద్భంగా సినీ కవి చంద్రబోస్, సంగీత దర్శకులు థమన్, సినీ హీరో రాజ్ తరుణ్‌కు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నిర్వాహకులు సుబ్బరాజు పాల్గొన్నారు.
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన రామజోగయ్య.... మరో ముగ్గురికి ఛాలెంజ్
ఇదీ చూడండి:ఆఫీస్‌కి కరోనా వచ్చింది.. నేను ఇంటికొచ్చేస్తున్నా!