హైదరాబాద్ పాతబస్తీలో రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. సైదాబాద్‌లో పోలీసు అడిషనల్ కమిషనర్ షికా గోయల్.. జాయింట్ సీపీ రమేశ్, మలక్ పేట ఏసీపీ వెంకటరమణలతో కలసి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో.. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన అడిషనల్ కమిషనర్
లాక్డౌన్ నేపథ్యంలో.. రంజాన్ పర్వదినాన మసీదులు ముస్లిం సోదరులు లేక వెలవెల బోతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో పండుగ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు.
additional commissioner
లాక్డౌన్ నేపథ్యంలో.. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు అనుమతి లేకపోవడంతో ప్రజలు ఇళ్లల్లోనే పండుగను జరుపుకున్నారు. ఆంక్షల కారణంగా పలు మసీదులు నిర్మానుష్యంగా మారగా.. ఉదయం పలు చోట్ల ముస్లింలు తక్కువ సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు.
ఇదీ చదవండి:రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్