ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా కిలోమీటరు పొడవు గల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన ఈ ర్యాలీలో 200మంది లయన్స్ క్లబ్ సభ్యులతోపాటు ట్యాంక్ బండ్‌కి వచ్చిన పర్యాటకులు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.
ట్యాంక్‌బండ్‌పై వెల్లివిరిసిన దేశభక్తి... కిలోమీటరు పొడవు జాతీయ జెండాతో ర్యాలీ - telangana varthalu
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై కిలోమీటరు పొడవు గల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
కిలోమీటరు పొడవు జాతీయ జెండాతో ర్యాలీ
కులమతాలకు అతీతంగా, చిన్నా పెద్దా అని తేడా లేకుండా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదికా అమృత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి:Telugu academy fd scam: తెలుగు అకాడమీ నిధులను ఎవరు తీసుకున్నారు..?