జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. డీజీపీ మహేందర్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని సునిశిత ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించినట్లు తెలిపారు. ర్యాలీలు, ఊరేగింపులను పూర్తిగా నిషేధించారు.
రాష్ట్రంలో ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం - rallies
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ర్యాలీలు, ఊరేగింపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
ర్యాలీలు.. ఊరేగింపులు నిషేధం: మహేందర్‌రెడ్డి