తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ్​కు రాఖీ కట్టిన సోదరి.. భట్టికి రాఖీ కట్టిన సీతక్క! - rakshabandhaan

రక్షా బంధన్​ సందర్భంగా పీసీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి ఆయన సోదరి హితశ్రీ  రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మోకాలి గాయం వల్ల ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఉత్తమ్​ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Raksha bhandan celebrations in pcc chief uttam house
ఉత్తమ్​కు రాఖీ కట్టిన సోదరి.. భట్టికి రాఖీ కట్టిన సీతక్క!

By

Published : Aug 3, 2020, 5:41 PM IST

రాఖీ పండుగ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి ఆయన సోదరి హితశ్రీ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మోకాలికి దెబ్బ తగలడం వల్ల గత కొన్ని రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఉత్తమ్​ ప్రజలకు రక్షా బంధన్​ శుభాకాంక్షలు తెలిపారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సీతక్కకు శానిటైజర్​ బాటిల్​ బహుమతిగా ఇచ్చారు. ప్రజలంతా కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం భవనాల మీద కాక.. ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని వారు కోరారు.

ఇదీ చూడండి :పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details