తెలంగాణ

telangana

ETV Bharat / state

సోదరికి అరుదైన 'ఆరు' బహుమతులు - rakhee

అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలకు గుర్తు రాఖీ పౌర్ణమి. అక్కలు, చెల్లెళ్లు త‌మ సోద‌రుల‌కు రాఖీల‌ను క‌ట్టి.. త‌మ‌కు ర‌క్షగా ఉండ‌మ‌ని కోరుకుంటారు. రాఖీ కట్టిన సోదరికి ఏదో ఒక బహుమతి సోదరులు ఇస్తారు. ఆ బహుమతి తనకు ఉపయోగపడేది ఇస్తే ఇంకెంత బాగుంటుంది. వినూత్నంగా ఉండే ఈ గిఫ్ట్స్ తప్పక సోదరికి నచ్చుతాయి. ఒకసారి ట్రైచేయండి.

సోదరికి అరుదైన 'ఆరు' బహుమతులు

By

Published : Aug 15, 2019, 10:26 AM IST

Updated : Aug 15, 2019, 10:58 AM IST

రక్షాబంధన్ ... ప్రియమైన చెల్లెలికి బహుమతి ఏమిస్తే బాగుంటుంది అని ప్రతీ అన్నా ఆలోచిస్తాడు. అక్క కోసం ఏ గిఫ్ట్ కొనాలని తమ్ముడు తాపత్రయ పడతాడు. ఎప్పుడూ ఇచ్చే చాక్లెట్లు, డ్రెస్సులు లాంటివి కాకుండా కొంచెం భిన్నంగా సోదరికి ఉపయోగపడే బహుమతులు ఇస్తే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన బహుమతులు ఇవే...

1. సేఫ్టీ కిట్

సోదరికి అరుదైన 'ఆరు' బహుమతులు

సోదరి భద్రత కోసం సేఫ్టీ కిట్​ను బహుమతిగా ఇస్తే అది ఉపయోగపడుతుంది. అంటే పెప్పర్ స్ప్రే, చిన్న టార్చ్, ఆత్మ రక్షణ అలారం లాంటివి ఒక బాక్స్ లో పెట్టి గిఫ్ట్ గా ఇవ్వండి. దేశంలో జరుగుతున్న లైంగిక దాడుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ లో ఈ కిట్ 199 రూపాయల నుంచి 599 రూపాయలలో దొరుకుతుంది.

2. గిఫ్ట్ ఆఫ్ ఫిట్ నెస్

ఇది మీ సోదరికి మంచి బహుమతి. వ్యాయామం మనిషి జీవితంలో ముఖ్యమైంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫిన్ నెస్ ట్రైనింగ్ సెంటర్ లో పాస్ తీసుకొని బహుమతిగా ఇవ్వొచ్చు. ఇది వెయ్యి రూపాయలలోపే ఉంటుంది.

సోదరికి అరుదైన 'ఆరు' బహుమతులు

3. పర్సనల్ అసిస్టెంట్

గూగుల్ హోమ్, అమెజాన్ ఎకో డివైజెస్ వ్యక్తిగత పనులకు ఉపయోగపడుతున్నాయి. ఇవి అమెజాన్, ఫ్లిప్ కార్డుల్లో 4 వేలకు దొరుకుతున్నాయి.

సోదరికి అరుదైన 'ఆరు' బహుమతులు

4. రుచికరమైన గిఫ్ట్ బాస్కెట్

మీ సోదరి మంచి ఆహార ప్రియులైతే ...బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంటర్ నేషనల్ చీజెస్, జమ్స్ లాంటి వాటితో నిండిన ఫుడ్ బాస్కెట్ ను ఇవ్వండి. 800 నుంచి 5 వేల రూపాయలలో ఇవి దొరుకుతాయి.

సోదరికి అరుదైన 'ఆరు' బహుమతులు

5. ఫన్ కారికేచర్

సోదరి ఫొటోని ఫన్నీగా చూపిస్తూ కారికేచర్ ను తయారుచేయించి ఇవ్వొచ్చు. అది చూసినప్పుడల్లా మిమ్మల్ని తలచుకొని నవ్వుకుంటుంది. 550 రూపాయలతో దీనిని తయారుచేయించొచ్చు.

సోదరికి అరుదైన 'ఆరు' బహుమతులు

6. గిఫ్ట్ కార్డ్స్

సోదరి అభిరుచికి తగ్గట్టుగా మంచి గిఫ్ట్ కార్డును ఇవ్వొచ్చు. వారు సంతోషంగా దానిని తీసుకుంటారు.

సోదరికి అరుదైన 'ఆరు' బహుమతులు
Last Updated : Aug 15, 2019, 10:58 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details