Rakhi Purnima 2023 Special Story : రక్షాబంధన్ వస్తుందంటే చాలు అమ్మాయిలకు పండగే. నెల రోజుల ముందు నుంచి ఎన్నో ప్రణాళికలు రచిస్తారు. రంగురంగుల బట్టలతో మొహంలో చిరునవ్వులు విరజిమ్ముతూ వాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. బాల్యంలో తనతో బుడిబుడి నడకలు వేసి, ఆటలు ఆడిన ముద్దుల అన్నయ్యకు రాఖీ కట్టడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రాఖీ పండుగకు ముందుగానే మిత్రులతో కలిసి దుకాణానికి వెళ్లి ఎలాంటి రాఖీ కొనాలి.. ఏ స్వీట్స్ అయితే తన సోదరునికి ఇష్టం.. ఇలా చాలా ఆలోచించి కొనుగోలు చేస్తారు.
Raksha Bandhan Wishes and Quotes in Telugu: మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్ & స్పెషల్ కోట్స్
కులమత భేదాల్లేవ్.. చిన్నా పెద్దా అనే తేడాల్లేవ్..:రాఖీ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది అన్నా-చెల్లెల పండుగ అని. అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు ఒకరికి ఒకరు ప్రేమాభిమానాలు పంచుకుంటూ.. కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని భరోసానిచ్చే పండేగే ఈ రక్షాబంధన్(Raksha bandhan). ఈ పండగను ఒకప్పుడు కేవలం ఉత్తర భారతదేశంలోనే ఎంతో ఘనంగా జరిపేవారు. కానీ నేడు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. కులమతాల భేదాలు లేవు, చిన్నా పెద్దా అని తారతమ్యం లేదు. రక్షాబంధన్వస్తోందంటే చాలు దేశమంతటా సోదరమయంగా మారిపోతుంది. వసుదైక కుటుంబంగా భావించే మన దేశంలో.. రాఖీ పండుగ సోదర సోదరీమణుల ప్రేమానురాగాలకు చక్కని వేదికగా నిలుస్తోంది.
Raksha Bandhan 2023 :అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. వసుదైక కుటుంబంగా వర్ధిల్లుతున్న మన దేశంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అన్నాచెల్లెలు, అక్కాతమ్ముల బంధానికి విడదీయరాని సంబంధం ఉంది. కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ జీవితాంతం ఆనందంగా జీవించాలనేదే ఈ పండుగ అంతరార్థం. సాధారణంగా ఈ పండుగను చంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. శ్రామణమాసంలో చేస్తారు. చెల్లి అన్నకు రాఖీ కట్టి ఎల్లప్పుడూ సోదరుడు తనకు రక్షగా ఉండాలని, తాను అన్నకు జీవితాంతం తోడుగా ఉండాలని కోరుకుంటుంది. ఆరోజు ఎక్కడ ఉన్నా.. అన్నయ్య/తమ్ముడిని చేరుకుని రాఖీ కడుతుంది.
TSRTC Good News To Women On Rakhi Pournami : రాఖీ పౌర్ణమికి మహిళలకు ప్రత్యేక ఆఫర్.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే బహుమతులు
సైనికులకు రాఖీ : రాఖీ అంటే కేవలం ఒకే తల్లి కడుపున పుట్టిన వారికే కట్టేది మాత్రమే కాదు. మన దేశానికి నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు రాఖీ కట్టి విశ్వమానవ సోదరభావాన్ని మన మహిళలు చాటిచెబుతున్నారు. భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంగా అభివర్ణిస్తారు. భారతీయ స్ర్తీలు ఎంతోదేశభక్తి ని కలిగియున్నారనడానికి ఇవే నిదర్శనం ప్రతి సంవత్సరం కూడా దేశసరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు రాఖీ(Rakhi) కట్టడం నిజంగా గొప్పవిషయం.
Indian Postal Service :తరాలు మారాయి..మానవ ఆలోచనల్లోనూ మార్పులు వస్తున్నాయి. అలాగే వారి పద్ధతుల్లో కూడా మార్పులు వచ్చాయి. కాలనుగుణంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను(Technology) వినియోగించుకుంటున్నారు నేటి అమ్మాయిలు. ఎక్కడో ఇతర రాష్ర్టం అవతల ఉన్న తన సోదరుడికి రాఖీ కట్టాలంటే అంతదూరం వెళ్లడం దాదాపు అసాద్యం, కష్టసాధ్యం అవుతోంది. కాబట్టి నేడు ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా రాఖీని పంపుతున్నారు. తద్వారా తన సోదరుని గుర్తుచేసుకోవడానికి అవకాశం కలుగుతోంది. ఈ మధ్య ఈ విధంగా రాఖీలు పంపేవారి సంఖ్య పెరిగింది.
ఈ పండగ నిన్నమొన్నటిది అనుకుంటే పొరపాటే దీనికి పెద్ద స్టోరీయే ఉందండోయ్...
ఇతిహాసాల్లో రాఖీ : అయితే ఈ పండగ గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉండగా వాటిలో ముఖ్యమైనది శిశుపాలుడి పైకి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన సమయంలో ఆయన చేతివేలుకు గాయమైంది. అది చూసిన ద్రౌపది తన చీరకొంగులో ఒక చిన్న భాగాన్ని చింపి శ్రీకృష్ణునికి కట్టిందట. అప్పుడు తన పట్ల తన సోదరికి ఉన్న అభిమానానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు తన జీవితాంతం ద్రౌపదికి తోడు ఉంటానని మాట ఇచ్చారంట. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి నుండి ద్రౌపదిని కాపాడిన శ్రీకృష్ణుని ఈ వృత్తాంతం చరిత్రలో ప్రసిద్ధికెక్కింది.
Rakhi Purnima History :ప్రపంచ విజేతగా నిలవాలనుకొని చరిత్రపుటల్లో నిలిచిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ గురించి మనం విన్నాం. అయితే ఆయనకు ఈ పండగకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా. కీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ భారతదేశంపై ప్రపంచ విజయయాత్రకు వచ్చాడు. ఈ క్రమంలోనే బాక్ర్టియా(నేటి అప్ఘనిస్థాన్) కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకొన్నాడు. ఆ వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని జీలం, చీనాబ్, నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలనే ఆలోచనతో యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రురాజైన అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండయాత్రకు ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు ధైర్యసాహాసాలు ప్రదర్శించి అతన్ని ఎదుర్కొన్నాడు. అయితే అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రొక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. అప్పటినుంచి రాఖీ చరిత్రలో(History of Rakhi) నిలిచిపోయింది.
Raksha Bandhan Gift Ideas : మీ సోదరికి రక్షా బంధన్ కానుక ఇవ్వాలా?.. ఈ ఫైనాన్సియల్ గిఫ్ట్స్ ట్రై చేయండి!
హైదరాబాద్‌లో పండుగ సందడి.. అక్కాచెల్లెల్లతో కళకళలాడుతోన్న 'రాఖీ' దుకాణాలు