తెలంగాణ

telangana

ETV Bharat / state

'పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి' - telangana varthalu

ముఖ్యమంత్రి కేసీఆర్​ చేపట్టిన హరితహారం స్పూర్తితోనే తాను గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని ఎంపీ జోగినపల్లి సంతోష్​ కుమార్​ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున విధిగా మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన సూచించారు.

'పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి'
'పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి'

By

Published : Jan 29, 2021, 8:34 PM IST

ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున విధిగా మూడు మొక్కలు నాటి, వాటిని కన్నబిడ్డల్లా సంరక్షించాలని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమ నిర్వాహకులు జోగినపల్లి సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వృక్షవేదం పుస్తకంపై హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాల నిర్వహించిన పరిచయ సభలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని... భారతదేశ పర్యావరణ ఉద్యమానికి రెండు కార్యక్రమాలు సరికొత్త ఉత్తేజాన్ని అందించాయని సంతోష్ కుమార్ తెలిపారు.

యువత, విద్యార్థులు త్వరగా ఆకర్షితులు అయ్యేందుకే గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో బాలీవుడ్, టాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ క్రీడాకారులను భాగస్వాములను చేశానని సంతోష్ కుమార్ అన్నారు. త్వరలోనే రాష్ట్రపతి, ప్రధానమంత్రి కూడా గ్రీన్ ఛాలెంజ్​ని స్వీకరించేలా విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. ఆటపాటల ద్వారా చెట్ల ప్రాముఖ్యతను బాల్యదశ నుంచే విద్యార్థులకు ప్రబోధించాలని పద్మశ్రీ వనజీవి రామయ్య సూచించారు.

ఇదీ చదవండి: సాంకేతిక పరిజ్ఞానంతో అనేక సవాళ్లకు పరిష్కారం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details