Rajyasabha Chairman office on Privilage Notice: ప్రధాని మోదీపై తెరాస ఎంపీలు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన తీర్మానంపై రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం స్పందించింది. తెరాస ఎంపీలు ఇచ్చిన నోటీసు ప్రివిలేజ్ కిందకు రాదని తేల్చి చెప్పింది. బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించే సమయంలో ప్రధాని మోదీ కాంగ్రెస్తో పాటు తెలంగాణ ఏర్పాటు చేసిన తీరుపైనా వ్యాఖ్యానించారు.
'ప్రధానిపై తెరాస ఎంపీలు ఇచ్చిన నోటీసు ప్రివిలేజ్ కిందకు రాదు' - ts news
Rajyasabha Chairman office on Privilage Notice: ప్రధానిపై తెరాస ఎంపీల సభా హక్కుల ఉల్లంఘన తీర్మానంపై రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం స్పందించింది. తెరాస ఎంపీలు ఇచ్చిన నోటీసు ప్రివిలేజ్ కిందకు రాదని తేల్చి చెప్పింది.
'ప్రధానిపై తెరాస ఎంపీలు ఇచ్చిన నోటీసు ప్రివిలేజ్ కిందకు రాదు'
తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఏర్పాటును ప్రధాని అవమానించారంటూ తెరాస ఎంపీలు ప్రివిలేజ్ నోటీసును ఇచ్చారు. గత నెల 10న ప్రధానిపై రాజ్యసభలో, లోక్సభలో ప్రివిలేజ్ నోటీసులు విడివిడిగా ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు ఇచ్చారు. గత నెలలో ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుపై ఈనెల 17న రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎంపీ కేశవరావుకు సమాచారం పంపినట్లు రాజ్యసభ సచివాలయ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: