భారత రాజ్యాంగం 70వ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు రాజకీయ, కుల సంఘాల నాయకులు బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు నివాళుర్పించారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్యతో పాటు పలు కుల సంఘాల నాయకులు పూలమాలలు వేశారు. భారతదేశానికి ఈరోజు ఎంతో శుభదినమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు.
'అంబేడ్కర్ అందరివాడు'.. ఈరోజు ఎంతో శుభదినం - భారత రాజ్యాంగం 70 వసంతాలు
రాజ్యాంగం రూపుదిద్దుకున్న ఈరోజు ఎంతో శుభదినమని.. రాజ్యాంగం ఆవశ్యకత ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. భారత రాజ్యాంగం 70 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'అంబేడ్కర్ అందరివాడు'.. ఈ రోజు ఎంతో శుభదినం
అంబేడ్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మాత్రమే రాజ్యాంగం రాయలేదని... అందరి కోసం రాశారని... ఆయన అందరి వాడు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలు, పోలీసు స్టేషన్‌లు, ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేడ్కర్ ఫోటోలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం