తెలంగాణ

telangana

ETV Bharat / state

Mallikarjun Kharge: 'అబద్ధపు మాటలతో భాజపా నేతలు కాలం వెళ్లదీస్తున్నారు'

పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నేటికి అయిదేళ్లు పూర్తి అయినా... నోట్ల రద్దు వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశం ఎందుకు నెరవేరలేదని ప్రశ్నించారు. రద్దు చేసిన రోజు దేశానికి చీకటి రోజని విమర్శించారు.

By

Published : Nov 8, 2021, 10:14 PM IST

Mallikarjun Kharge
Mallikarjun Kharge

కేంద్ర ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై పది రూపాయలు తగ్గించినంత మాత్రాన ఏలాంటి ప్రయోజనం లేదని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. అన్నీ అబద్ధపు మాటలతో భాజపా కాలం వెల్లదీస్తోందని ద్వజమెత్తారు. మూడు నెలల్లో కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన రూ.1.92 లక్షలు లబ్ధి పొందిందని, ఇప్పుడు ధరలు తగ్గించడం వల్ల కేవలం రూ.13వేల కోట్లు మాత్రమే తగ్గుతాయన్నారు. ధరల తగ్గుదలపై కేంద్రప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించిందని, రద్దు చేసిన సెస్ కూడా తక్కువేనని పేర్కొన్నారు.

అబద్ధపు మాటలతో భాజపా కాలం వెళ్లదీస్తుందని మల్లికార్జున ఖర్గే ద్వజమెత్తారు. ప్రత్యేక న్యాయస్థానం కూడా 2జీ కుంభకోణంలో ఏలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసిందని తెలిపారు. కొందరు కావాలనే కుట్ర పూరితంగా కాంగ్రెస్‌పై విషప్రచారం చేశారని ఆరోపించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, రాందేవ్ బాబా వంటివారు సైతం తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. సంజయ్ నిరుపమ్ మీద వినోద్ రాయ్ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ఆరోపించారు. నేటికి అయిదేళ్లు పూర్తి అయినా... నోట్ల రద్దు వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశం ఎందుకు నెరవేరలేదని ప్రశ్నించారు. రద్దు చేసిన రోజు దేశానికి చీకటి రోజని విమర్శించారు.

ఇదీ చదవండి:PET candidates protest in Hyderabad : 'ఏ కాలంలో ఉన్నాం? ఎందుకింత టైం పడుతోంది?'

ABOUT THE AUTHOR

...view details