తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం పాలసీ ఎల్లలు దాటి పంజాబ్, దిల్లీ వరకు చేరింది: లక్ష్మణ్ - ED notices for mlc kavitha

Mahila Gosa BJP Bharosa Deeksha: మద్యాన్ని కట్టడి చేయకపోతే తెలంగాణ వల్లకాడుగా మారే ప్రమాదం ఉందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్​ ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలతో పాటు రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతోందని పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా గోస - బీజేపీ భరోసా పేరుతో చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన ఆయన.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొట్టి.. రిటైలర్​కి లాభం వచ్చేలా మద్యం పాలసీ తెచ్చారని ఆరోపించారు.

MP Lakman
MP Lakman

By

Published : Mar 10, 2023, 4:55 PM IST

Mahila Gosa BJP Bharosa Deeksha: బీఆర్​ఎస్​ ప్రభుత్వం మద్యం పాలసీ విధానంతో దేశాన్ని నడపాలని చూస్తోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కవిత కుంభకోణంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. బీఆర్​ఎస్​ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా గోస - బీజేపీ భరోసా పేరుతో చేపట్టిన దీక్షకు ఆయన హాజరై డీకే అరుణకు మద్దతు తెలిపారు.

అనంతరం మాట్లాడిన ఆయన.. ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ.. ఎక్సైజ్ ప్రమోషన్ శాఖగా మారిందని విమర్శించారు. మద్యం అమ్మకాలతో పాటు రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతోందని ఆరోపించారు. మద్యాన్ని కట్టడి చేయకపోతే తెలంగాణ వల్లకాడుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొట్టి.. రిటైలర్​కి లాభం వచ్చేలా మద్యం పాలసీ తెచ్చారని ఆరోపించిన ఆయన.. మద్యం పాలసీ ఎల్లలు దాటి పంజాబ్, దిల్లీ వరకు చేరిందని విమర్శించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలపై బీఆర్​ఎస్​ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన లక్ష్మణ్.. ఈడీ, సీబీఐలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే.. ఏసీబీ సంస్థ మీ జేబు సంస్థనా అని విమర్శించారు. "డ్రగ్స్ కేసు ఏమైంది ? విచారణ ఎక్కడ ? ముడుపులు ముట్టాయా? ఓటుకు నోటు కేసు ఏమైంది..? దాని మీద ఎందుకు మాట్లాడటం లేదని" లక్ష్మణ్​ సూటిగా ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థల మీద బీఆర్​ఎస్​ నేతలకు నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.

మహిళా బిల్లును ఎవరు కాదంటున్నారని పేర్కొన్న ఆయన.. అన్ని పార్టీలను ఒప్పించి బిల్లు తేవాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారని తెలిపారు. మద్యం అవినీతికి, తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు. నిజాయతీ పరులైతే విచారణలో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం మద్యం మాఫియా చేతుల్లో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ.. ఎక్సైజ్ ప్రమోషన్ శాఖగా మారింది. మద్యం పాలసీ ఎల్లలు దాటి పంజాబ్, దిల్లీ వరకు చేరింది. మద్యం దందాపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. మద్యం కేసులో కాంగ్రెస్ నేతలు ఉన్నారనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు ఏమైంది? దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు. డ్రగ్స్ కేసు ఏమైంది..? విచారణ ఎక్కడ..? మహిళా బిల్లును ఎవరు కాదంటున్నారు. నిజాయతీ పరులైతే విచారణలో నిరూపించుకోండి"- లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు

ఇవీ చదవండి:

ఈ పోరాటం ఆగదు.. వెనకడుగు వేసేదేలే: ఎమ్మెల్సీ కవిత

కేటీఆర్​కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్.. అది నిరూపిస్తే..?

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : టీ కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details