TRS Changed to BRS : పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలన్న ఎంపీల అభ్యర్థనను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వెంటనే అంగీకరించారు. ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు లోక్‌సభ ఛైర్మన్ ఓం బిర్లా కూడా పార్టీ పేరు మార్పుపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని బీఆర్‌ఎస్ ఎంపీలకు తెలిపారు. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన లేఖను.. ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కేశవరావు స్పీకర్‌లకు ఇచ్చారు.
ఎంపీల అభ్యర్థనకు రాజ్యసభ ఛైర్మన్ ఓకే.. పార్లమెంటులోనూ ఇకపై బీఆర్‌ఎస్..! - MP Nama Nageswara Rao latest news
TRS Changed to BRS : టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చాలన్న ఎంపీల అభ్యర్థనను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అంగీకరించారు. ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు లోక్‌సభ స్పీకర్ కూడా ఈ వ్యవహారంపై సానుకూలంగా స్పందించి.. పేరు మార్పుపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
![ఎంపీల అభ్యర్థనకు రాజ్యసభ ఛైర్మన్ ఓకే.. పార్లమెంటులోనూ ఇకపై బీఆర్‌ఎస్..! Rajya Sabha which changed TRS to BRS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17289288-623-17289288-1671785228056.jpg)
Rajya Sabha which changed TRS to BRS