తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజీవ్ స్వగృహ టవర్ల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - హైదరాబాద్ తాజా వార్తలు

Rajiv swagruha towers for sale: ఇప్పటి వరకు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విడిగా అమ్మకానికి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పుడు ఏకమొత్తంగా టవర్ల అమ్మకాన్ని చేపట్టింది. పోచారం, గాజులరామారంలోని ఇంకా మొత్తం పనులు పూర్తి కాని టవర్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

Rajiv swagruha towers
Rajiv swagruha towers

By

Published : Dec 24, 2022, 7:57 PM IST

Rajiv swagruha towers for sale: రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మకానికి పెట్టింది. రెండు చోట్లా ఉన్న వాటిని టవర్ల వారీగా విక్రయించనున్నారు. పోచారంలో నాలుగు, గాజులరామారంలో ఐదింటిని టవర్లను అమ్మకానికి పెట్టారు. పోచారంలోని ఒక్కో టవర్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉండగా... గాజుల రామారంలోని ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి.

ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30 వ తేదీ వరకు గడువు ఇచ్చారు. లాటరీ ద్వారా టవర్లను కేటాయిస్తారు. www.hmda.gov.in , www.swagruha.telangana.gov.in వెబ్​సైట్లలో టవర్ల వివరాలు, పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details