Rajiv Swagruha Flats Auction: రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన ఫ్లాట్ల విక్రయం కోసం హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. బండ్లగూడ, నాగోల్ లోని సహభావనా టౌన్షిప్లో 15 సముదాయాలకు చెందిన 2246 ఫ్లాట్లు ఉన్నాయి. వీటికి కనీస ధర చదరపు గజానికి 2200 రూపాయల నుంచి 2700గా నిర్ధారించారు. ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని జలజ టౌన్షిప్ నందు ఎనిమిది టవర్లలో 576 ఫ్లాట్లకు గాను చదరపు గజానికి 1500 రూపాయలు నుంచి 2000గా నిర్ణయించారు.
Rajiv Swagruha Flats Auction: రాజీవ్ స్వగృహ పథకం ఫ్లాట్ల ఈ-వేలం నోటిఫికేషన్ - హైదరాబాద్ తాజా వార్తలు
Rajiv Swagruha Flats Auction: రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన ఫ్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయనుంది. హైదరాబాద్ లోని బండ్లగూడ, నాగోల్, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లిలో నిర్మించిన ఫ్లాట్ల సముదాయాల విక్రయం కోసం హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.
రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం
ఆసక్తి కలిగిన వారు మార్చి 22వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి రుసుము 11,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 4, 14 తేదీల్లో ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఫ్లాట్ల అమ్మకం కోసం మార్చి 24వ తేదీన నిర్వహిస్తారు.
ఇదీ చదవండి:తొర్రూర్ లే అవుట్ వేలంకు సంబంధించి నేడు ప్రీ బిడ్ సమావేశం..