అపోలో నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ - Rajinikanth discharged from apollo

15:20 December 27
అపోలో నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్
హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జయ్యారు. హైదరాబాద్ నుంచి ఆయన చెన్నై బయలుదేరి వెళ్లారు. రజనీకాంత్ రక్తపోటు సాధారణ స్థితికి వచ్చిందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వారం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఒత్తిడికి గురికాకుండా కొద్దిగా వ్యాయామం చేయాలని వివరించారు. వయసు రీత్యా రజనీకాంత్ ఆరోగ్య నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ దృష్ట్యా పలు జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. అధిక రక్తపోటుతో అస్వస్థతకు గురికావడం వల్ల రజనీ అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.