Rajendra Nagar PS awarded Best Police Station in India : దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పీఎస్‌గా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(Ministry of Home Affairs) 2023 సంవత్సరానికి దేశంలోనే అత్యుత్తమ పోలీస్స్టేషన్ల జాబితాను ప్రకటించింది. అందులో భారతదేశంలో ఉన్న దాదాపు 17 వేలకు పైగా ఉన్న పోలీస్స్టేషన్లలో రాజేంద్రనగనర్ పోలీస్‌స్టేషన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
కానిస్టేబుల్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరించిన హైకోర్టు ధర్మాసనం
జైపూర్‌లో జరిగిన అన్నిరాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah)చేతుల మీదుగా రాజేంద్రనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(Station House Officer) బి.నాగేంద్రబాబు ట్రోఫీని అందుకున్నారు. దీని పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అధికారులను అభినందనలు తెలిపారు. ఈ జాబితాలో ద్వితీయ, తృతీయ బహుమతులను కశ్మీర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు గెలుచుకున్నాయి.
పోలీస్స్టేషన్ల పనితీరు ఆధారంగా వివిధ రకాల ప్రామాణికాలను పరిశీలించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ బహుమతులను ప్రకటించింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల దర్యాప్తు తీరు ఆధారంగా పోలీస్‌స్టేషన్ భవన నిర్వహణ తదితర అంశాలు ఆధారంగా ఈ ట్రోఫీకి ఎంపిక చేశారు. మహిళలపై కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలను కేంద్రహోం మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించి ఈ బహుమతులను ప్రకటించారు.