తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజీవ్​గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారు: ఉత్తమ్​కుమార్ - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి తాజా వార్తలు

రాజీవ్​గాంధీ 76వ జయంతి సందర్భంగా గాంధీభవన్​లో కాంగ్రెస్​ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్​, జానారెడ్డి తదితరులు రాజీవ్​గాంధీ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు.

rajeev gandhi birth anniversary celebrations in gandhi bhavan hyderabad
రాజీవ్​గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారు: ఉత్తమ్​కుమార్

By

Published : Aug 20, 2020, 1:15 PM IST

ఇందిరాగాంధీ, నెహ్రూ కుటుంబాలు దేశానికి చేసిన సేవలను తక్కువ చేసి చూపే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. హోం శాఖ మంత్రి అమిత్​ షా కూడా పార్లమెంట్​లో కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావిస్తూ... నెహ్రూను తక్కువ చేసి చూపారని ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ 76వ జయంతి సందర్భంగా గాంధీభవన్​లో కాంగ్రెస్​ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్​, జానారెడ్డి తదితరులు రాజీవ్​గాంధీ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు.

దేశానికి, కాంగ్రెస్​ పార్టీకి, రాజీవ్ గాంధీ ఎనలేని సేవ చేశారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కొనియాడారు. శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయడం, పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు తీసుకురావడం లాంటి వాటితో భారత్ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపారని చెప్పారు.

ఇదీ చూడండి:కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details