ఎన్నికలకు అధికారుల సన్నద్ధత....! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో రజత్ కుమార్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. అవగాహన లేకే వికారాబాద్ కలెక్టర్ ఈవీఎంలను తెరిచారని రజత్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. సాధారణ బదిలీలతో తమకు సంబంధం లేదని... మూడేళ్లు పూర్తై ఎన్నికల విధులు నిర్వహించే వారిని బదిలీ చేయాలని వెల్లడించారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ సర్పంచ్ ఎన్నిక మరోసారి నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్నికలు జరపకూడదని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది.