తెలంగాణ

telangana

ETV Bharat / state

Rajath Kumar Comments: 'కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం' - తెలంగాణ వార్తలు

ఇవాళ్టి కేఆర్ఎంబీ భేటీలో ఉపసంఘం నివేదికపైనే చర్చ ఉంటుందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నామని వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్వహణ ఎలా చేస్తారని అడుగుతున్నామని పేర్కొన్నారు.

Rajath Kumar Comments, krmb sub committee meeting
కేఆర్​ఎంబీ ఉపసంఘం సమావేశం, రజత్ కుమార్

By

Published : Oct 12, 2021, 12:10 PM IST

Updated : Oct 12, 2021, 12:30 PM IST

కృష్ణానదీ యాజమాన్య బోర్డు-కేఆర్​ఎంబీ(KRMB) సమావేశంలో ఇవాళ ఉపసంఘం నివేదికపై మాత్రమే చర్చ ఉంటుందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా అడుగుతున్నామని మరోసారి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. బోర్డు పరిధిలోకి ఏ ప్రాజెక్టులు ఇవ్వాలనే అంశంపై సమావేశంలో చర్చిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి ఉన్నప్పుడు కృష్ణ జలాల్లో 811 టీఎంసీలు నీరు వాటా వచ్చింది. దీంతోపాటు మహారాష్ట్ర, కర్నాటకకు కూడా ఉంది. 811 టీఎంసీలు అనేది పాత వాటా. తెలంగాణ వచ్చినప్పటి నుంచి అనగా 2014 నుంచి వాస్తవ కేటాయింపులు జరగాలని మేం అడుగుతున్నాం. ఇప్పటివరకు తాత్కాలిక అరెంజ్​మెంట్ జరుగుతోంది. 811 టీఎంసీల్లో తెలంగాణ 299 టీఎంసీలు వాడుకుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్లు మిగతా 512 టీఎంసీలు వాడుకున్నారు. ప్రాజెక్టులే అట్లా కట్టారు. 299 టీఎంసీలు+512 టీఎంసీలు కంటిన్యూ అవుతోంది. దీంతో మేము సంతోషంగాలేము. మాకు ఇచ్చే వాటర్ సరిపోవట్లేదు. ఆంధ్రప్రదేశ్​ ఈ వాటర్​ను ఔట్​ఆఫ్ బేసన్ వాడుతున్నారు. అందుకే కనీసం ఇన్​బేసన్ ప్రాజెక్టుకు ప్రాముఖ్యత ఇస్తూ... 105 టీఎంసీల వాటర్ మాకు ఇవ్వాలని కోరుతున్నాం.

-రజత్ కుమార్,నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

వాటా పెరగాలి..

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాలని.. నదీ పరివాహక ప్రాంతం ఇక్కడే ఎక్కువగా ఉందని రజత్‌కుమార్‌ వెల్లడించారు. నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలన్నారు. తెలంగాణకు వాటా ప్రకారం 570 టీఎంసీలు కేటాయించాలనే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీలకు మరో 105 టీఎంసీలు కేటాయించాలని కేఆర్​ఎంబీ( KRMB)ని కోరుతున్నామని రజత్‌కుమార్‌ చెప్పారు. బోర్డు పరిధిలోకి విద్యుత్ ప్రాజెక్టులు తీసుకురావాలని కోరుతున్నారని... కనీస నీటిమట్టాలు నిర్ణయిస్తే బాగుటుందని సూచించారు.

బోర్డు పరిధిలోకి విద్యుత్ ప్రాజెక్టులు సైతం ఉండాలని కోరుతున్నారు. తెలంగాణలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. నీటి వాటాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా మాకు చాలా ముఖ్యం. తెలంగాణకు విద్యుత్ చాలా ముఖ్యం. ఎత్తిపోతల పథకాలు, బోరు బావులున్నందున అవసరం ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలుగా నిర్ణయించి.. అందుకు అనుగుణంగా చేస్తే బాగుంటుంది. ఇవాళ్టి సమావేశంలో బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

-రజత్ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం

ఇదీ చదవండి:traffic problems in Hyderabad: ట్రాఫిక్ సమస్యలకు చెక్.. శరవేగంగా జీహెచ్​ఎంసీ పనులు

Last Updated : Oct 12, 2021, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details