కృష్ణా, గోదావరి బోర్డుల(krishna and godavari board)పరిధిని ఖరారు చేస్తూ... కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అధ్యయనం కొనసాగుతోందని... నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ (rajath kumar) తెలిపారు. హైదరాబాద్‌లోని జలసౌధలో(jalasoudha)ఇంజినీర్లు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. గెజిట్‌లోని అంశాలు, వాటి ప్రభావంపై చర్చిస్తున్నారు. పాలన, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కసరత్తు జరుగుతోందని వివరించారు.
కృష్ణా జలాల్లో (krishna water)రాష్ట్రానికి న్యాయపరమైన వాటా తేల్చాల్సి ఉందన్నారు. నీటి వాటా తేల్చకుండా బోర్డు నిర్వహణ ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. వాటా తేల్చే వరకు ఈ ఏడాది 811 టీఎంసీల్లో (TMC).... సగం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం(telangana government)కోరుతుందని వెల్లడించారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు(dpr)ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమేనన్న రజత్‌కుమార్... దేవాదుల, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టులన్నీ పాతవేనని గుర్తు చేశారు. తెలంగాణ వాటా ఖరారు కోసం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు విషయంలో..... కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు.