రూ.29 కోట్లు సీజ్
రేపు నిజామాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం - Rajat-kumar Press meet for Nizamabad Elections
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో పాటు ప్రత్యేక ఎన్నికల పరిశీలనాధికారులతో కూడిన బృందం రేపు నిజామాబాద్‌లో పర్యటించనుంది. ఇందూర్ ఎన్నికలపై ఉన్న అనుమానాలను పరిష్కరించేందుకే ఈ పర్యటన అని రజత్ స్పష్టం చేశారు.
rajat_kumar
రాష్ట్రంలో ఇప్పటి వరకు నగదు, మద్యం, వస్తువులు కలిపి రూ.29 కోట్ల సొత్తు సీజ్ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 300కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. చెల్లింపు వార్తలపై 600 ఫిర్యాదులు అందాయన్నారు. నిజామాబాద్‌లో ఎన్నికల నిర్వహణకు 1780 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈవీఎం సమస్యల పరిష్కారానికి 600 మంది ఇంజినీర్లు సిద్ధంగా ఉంటారన్నారు.