తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణా బోర్డు ఛైర్మన్​తో ముగిసిన రజత్​ కుమార్​ భేటీ

కృష్ణా బోర్డు ఛైర్మన్​ చంద్రశేఖర్​ అయ్యర్​తో నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్​ కుమార్​ భేటీ ముగిసింది. ఆయన వెంట ఈఎన్​సీ మురళీధర్​ కూడా ఉన్నారు. ఏపీ ప్రతిపాదిత కొత్త ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్ని విషయాలనపై చర్చించామని రజత్​ కుమార్​ వెల్లడించారు.

కృష్ణా బోర్డు ఛైర్మన్​తో రజత్​ కుమార్​ భేటీ
కృష్ణా బోర్డు ఛైర్మన్​తో రజత్​ కుమార్​ భేటీ

By

Published : May 13, 2020, 3:58 PM IST

Updated : May 13, 2020, 4:33 PM IST

బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్​ అయ్యర్​తో నీటిపారుదల ముఖ్య కార్యదర్శి భేటీ ముగిసింది. ఏపీ ప్రతిపాదిత పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయమై చర్చించారు. ఈ భేటీలో ఈఎన్​సీ మురళీధర్ పాల్గొన్నారు. సమావేశంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విషయాలు చర్చకు వచ్చాయని రజత్​ కుమార్​ తెలిపారు.

చర్చలో అన్ని విషయాలపై మాట్లాడాం. మర్యాదపూర్వకంగా ఆయన అన్ని విన్నారు. ప్రాజెక్టు ఒక్కసారి ప్రారంభమైతే ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాలపై కూడా చర్చించాం. బోర్డుకు ఉన్న అధికారాలతో ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామని చెప్పారు.

-రజత్​ కుమార్​, నీటి పారుదల ముఖ్య కార్యదర్శి

కృష్ణా బోర్డు ఛైర్మన్​తో ముగిసిన రజత్​ కుమార్​ భేటీ

మిగులు జలాలపై చర్చించేందుకు భేటీ అయిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో కేంద్ర జలసంఘం సీఈ విజయ్ సరన్, కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఈలు నరసింహారావు, నాగేశ్వరరావు హాజరయ్యారు. మిగులు జలాల వినియోగ విధివిధానాలపై దృశ్యమాధ్యమం ద్వారా అధికారులు సమీక్షించారు. నెలాఖరులోగా మిగులు జలాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని... రెండు రాష్ట్రాలను కమిటీ కోరింది. ఇదే అంశంపై వచ్చే నెల మొదటి వారంలో మరోమారు కమిటీ సమావేశం కానుంది.

ఇదీ చూడండి:కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్​ దాడులు

Last Updated : May 13, 2020, 4:33 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details