కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా సీఓటీలో మార్పులు చేసింది. నీటిపారుదలశాఖ జనరల్ ఇంజనీర్ ఇన్ చీఫ్... కమిషనరేట్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ప్రజారోగ్య విభాగాల ఈఎన్సీలు లేదా సీఈలు సభ్యులుగా ఉంటారు. నీటిపారుదలశాఖ విచారణ విభాగం సీఈ, వర్క్స్-అకౌంట్స్ సంచాలకులు సీఓటీలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
నీటిపారుదల శాఖలో మార్పులు... ఉత్తర్వులు జారీ - నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్
నీటిపారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

నీటిపారుదల శాఖలో మార్పులు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం