హైదరాబాద్ పాతబస్తీ సహా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించిన 15 ఎకరాల భూవివాదంపై ధర్మం విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు.
హైకోర్టు తీర్పు తెరాస, ఎంఐఎంకు చెంపపెట్టు: రాజాసింగ్ - Mla rajasingh comments
ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించిన 15 ఎకరాల భూవివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పును స్వాగతిస్తూ... గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు.
హైకోర్టు తీర్పు తెరాస, ఎంఐఎంకు చెంపపెట్టు: రాజాసింగ్
అమ్మవారి దేవాలయానికి సంబంధించిన భూమి ఆలయానిదేనని హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల హిందూ ఆలయాలను కబ్జా చేయాలని దురాలోచన చేసే అధికార తెరాస, ఎంఐఎంకు చెంపపెట్టు అని రాజాసింగ్ అన్నారు.
ఇదీ చూడండి:దేవుళ్లకు ప్రాంతీయత అంటగడతారా..?: విజయశాంతి