తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీ మెట్రో లైన్‌ను ఎందుకు చేపట్టలేదు: ఎమ్మెల్యే రాజాసింగ్‌

Rajasingh reaction to the arrests of BJP leaders: హైదరాబాద్​ పాతబస్తీలో మెట్రో రైలు కోసం బీజేపీ నేతలు చేసిన దీక్షను పోలీసులు అడ్డుకోవడం పట్ల గోషామహాల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఖండించారు. పాతబస్తీకి మెట్రో లైను ఎందుకు తీసుకువెళ్లడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాతబస్తీ ప్రజల కోసం పోరాటం చేసేది బీజేపీ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు.

BJP MLA Rajasingh
BJP MLA Rajasingh

By

Published : Dec 14, 2022, 6:03 PM IST

Rajasingh reaction to the arrests of BJP leaders: గత అసెంబ్లీ సాక్షిగా పాతబస్తీలో మెట్రోలైన్​కు రూట్​ మ్యాప్​ సిద్దమైంది. నిధులు కూడా మంజూరయ్యాయి కానీ ఇంత వరకు ఎందుకు ముందుకు వెళ్లలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాతబస్తీకి మెట్రో లైన్​ను ఎందుకు తీసుకువెళ్లడం లేదని ఆయన మండిపడ్డారు. మెట్రో కోసం బీజేపీ నేతలు దీక్షలు చేస్తే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నారని రాజాసింగ్ ధ్వజమెత్తారు.

గత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కేసీఆర్​ పనులు ప్రారంభిస్తామని మాట ఇచ్చారన్నారని.. కానీ ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ అభివృద్ధి చెందితే కేసీఆర్​కు రాజకీయ భవిష్యత్ ఉండదనే భావనతోనే అభివృద్ధి కానివ్వండం లేదని ఆయన ఆరోపించారు. పాతబస్తీ ప్రజల కోసం పోరాటం చేసేది బీజేపీ ఒక్కటేనని.. పాతబస్తీ అభివృద్ధి చెందాలంటే బీజేపీకి మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తీ చేశారు.

బీజేపీ నేతలు అరెస్టు:హైదరాబాద్‌లోని లాల్‌ దర్వాజ వద్ద భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మెట్రోరైలును పాతబస్తీ వరకు పొడిగించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా నాయకులు ఈ రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. దీక్షకు ముందస్తు అనుమతి లేదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భాజపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి చేజారకుండా దక్షిణ మండలం అదనపు డీసీపీ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details